ముఖ్యమంత్రిగా విజయ్ దేవరకొండ మెప్పిస్తాడా


Will vijay devarakonda succeed as chief minister

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నోటా చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన నోటా చిత్రం అక్టోబర్ 5న భారీ ఎత్తున తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల అవుతోంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళ నిర్మాత కె ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. మొదట ఈ చిత్రాన్ని తమిళంలోనే నిర్మించినప్పటికి విజయ్ దేవరకొండ తెలుగు హీరో కావడంతో పాటుగా అనూహ్యంగా అర్జున్ రెడ్డి చిత్రంతో క్రేజ్ రావడంతో తెలుగు చిత్రం అంటూ కూడా ప్రచారం చేయడం మొదలు పెట్టారు అంతేకాదు తెలుగులో కొంత షూట్ చేశారు కూడా.

ముఖ్యమంత్రి గా వెండితెరపై పలువురు హీరోలు మెప్పించారు. విజయాలు అందుకున్నారు . మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంలో ఇటీవల ముఖ్యమంత్రి గా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు యువ హీరో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి గా నోటా లో నటిస్తున్నాడు . మరి విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి గా ప్రేక్షకులను అలరిస్తాడా ? లేదా ? అన్నది అక్టోబర్ 5 న తేలనుంది. విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి గా నటించగా మెహరీన్ జర్నలిస్ట్ గా నటించింది. సత్యరాజ్ , నాజర్ ముఖ్య పాత్రల్లో నటించారు. బ్యాడ్ బాయ్ గా ఉన్న యువకుడు ముఖ్యమంత్రి గా అధికారం చేపడితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో నోటా లో చూపించనున్నారట .

English Title: Will vijay devarakonda succeed as chief minister