నాని సినిమాని రిజెక్ట్ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్


Wink girl Priya prakash varrier rejected nani

నాని తాజాగా జెర్సీ చిత్రంలో నటిస్తుండగా తన తదుపరి చిత్రాన్ని మనం దర్శకులు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు . కాగా ఆ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ ని నటించమని కోరారట కానీ ఆ ఆఫర్ ని తిరస్కరించింది ఈ భామ . కొంటెగా కన్ను గీటుతూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భామ నాని సినిమాని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ……

 

ఆ చిత్రంలో నాని సరసన నటించే ఛాన్స్ రాలేదు ఈ భామకు , కేవలం నాని సిస్టర్ గా నటించే ఛాన్స్ వచ్చింది దాంతో నాని సినిమాని తిరస్కరించింది ప్రియా ప్రకాష్ వారియర్ . ఇప్పుడే హీరో చెల్లెలు పాత్రలు పోషిస్తే ఇక అన్నీ అవే వస్తాయి కాబట్టి మంచి నిర్ణయమే తీసుకుంది ఈ భామ . అన్నట్లు ఈ భామ నటించిన మలయాళ చిత్రం ఈనెల 14 న లవర్స్ డే గా తెలుగులో రిలీజ్ అవుతోంది .

 

English Title: Wink girl Priya prakash varrier rejected nani