రాబోయే నెం 1 కోడలు, త్రినయని సీరియల్ షూట్స్ అస్సలు మిస్ అవ్వకండి – పెళ్లి భాజాలు మ్రోగనున్నాయి


Popular pairs getting married in Zee Telugu - It's wedding week
Popular pairs getting married in Zee Telugu – It’s wedding week

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర ఎంటర్టైన్మెంట్ విషయంలో జీ తెలుగు ఎప్పుడూ ముందే ఉంటుంది. సీరియల్స్ తో కానీ, సినిమాలతో కానీ, షోస్ తో కానీ ఎంటర్టైన్మెంట్ పంచడంలో జీ తెలుగు సాటి వేరు. బుల్లితెరపై సీరియల్స్ తో జీ తెలుగు హంగామా మాములుగా లేదు. ముఖ్యంగా నెం 1 కోడలు, త్రినయని సీరియల్స్ తో దుమ్ముదులుపుతోంది. ఆకట్టుకునే కథనాలు, అదిరిపోయే ట్విస్ట్ లు ఈ సీరియల్స్ ప్రత్యేకత.

ఇక నెం 1 కోడలు సీరియల్ లో రాహుల్ – సరసు, త్రినయని సీరియల్ లో విశాల్ – నాయని ఎప్పుడు కలుస్తారా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఆ తరుణం రానే వచ్చింది. ఈ రెండు జంటల పెళ్లిళ్లను చిత్రీకరించారు.

దీనిపై జీ తెలుగు టీమ్ మాట్లాడుతూ, షూటింగ్ చేయడానికి చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఈ సీరియల్స్ లో పెళ్లి షూటింగ్ ను పూర్తి చేశామని తెలిపారు. షూటింగ్ మధ్యలో మాస్క్ లు ధరించి, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుని, చాలా తక్కువ మంది సిబ్బందితో ఈ పెళ్లి తంతు కానిచ్చేసారట. ఇకపై ఈ రెండు సీరియల్స్ మరింత ఆసక్తికరంగా సాగుతాయని అంటున్నారు. ఈ వారంలో ఈ పెళ్ళిళ్ళకి సంబంధించిన ఎపిసోడ్స్ ను టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ నెల 14 నుండి 17 తారీఖులు మధ్యలో ఈ ఎపిసోడ్స్ వస్తాయని తెలుస్తోంది. సోమవారం నుండి శనివారం వరకూ రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకూ ఈ రెండు సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయి. ప్రేక్షకులు వాటిని మిస్ అవ్వకూడదని జీ తెలుగు వారు కోరుకుంటున్నారు.