వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్


వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్
వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ గత వారం ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన విషయం తెల్సిందే. ఈ సినిమా తొలి రోజు నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో కలెక్షన్స్ కూడా వీక్ గానే వచ్చాయి. తొలి రోజు విజయ్ దేవరకొండ క్రేజ్ వల్ల ఈ చిత్రానికి 4 కోట్ల పైన షేర్ వచ్చింది. ఇక రెండో రోజు నుండి కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. తొలి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం 8.02 కోట్ల షేర్ సాధించింది. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లకు పైనే జరిగింది. మరి ఈరోజు నుండి మరో కొత్త సినిమా రిలీజ్ ఉండడంతో వరల్డ్ ఫేమస్ లవర్ ప్లాప్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

గౌతమ్ అనే రైటర్ పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ ఇందులో భిన్నమైన రోల్స్ లో కనిపించాడు. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్, ఇజబెల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఇందులో విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్ ల మధ్య శీనయ్య సువర్ణల ట్రాక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సెకండ్ హాఫ్ లో కధనం బాగా నెమ్మదించడంతో వరల్డ్ ఫేమస్ లవర్ కు నెగటివ్ రివ్యూస్ వచ్చాయి.

వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్:

నైజాం : Rs 4.03 కోట్లు

సీడెడ్ : Rs 72 లక్షలు

ఉత్తరాంధ్ర : Rs 84 లక్షలు

ఈస్ట్ : Rs 53 లక్షలు

వెస్ట్ : Rs 41 లక్షలు

గుంటూరు : Rs 70 లక్షలు

కృష్ణ : Rs 49 లక్షలు

నెల్లూరు : Rs 30 లక్షలు

ఆంధ్ర + తెలంగాణ : Rs 8.02 కోట్లు

విజయ్ దేవరకొండ ఈ ప్లాప్ నుండి త్వరగా బయటపడి పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టిన విషయం తెల్సిందే.