వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ తొలి రోజు క‌లెక్ష‌న్స్‌!


World famous lover First day collections
World famous lover First day collections

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌`. క్రాంతి మాధ‌వ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గ‌త చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌` ఆశంచిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. కె.ఎస్‌. రామారావు నిర్మించిన ఈ చిత్రం తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ టాక్‌తో సంబంధం లేకుండా ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌సూళ్ల‌ని సాధించింది.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోని ఏరియాల వారీగా తొలి రోజు వ‌సూళ్ల వివ‌రాలు:

నైజాం    –      రూ. 2.01 కోట్లు
సీడెడ్     –      రూ. 0.39 కోట్లు
ఉత్త‌రాంధ్ర – రూ. 0.52 కోట్లు
గుంటూరు  –  రూ. 43 కోట్లు
ఈస్ట్             –  రూ. 0.30 కోట్లు
వెస్ట్            –   రూ. 0. 20 కోట్లు
కృష్ణ          –    రూ. 0.25 కోట్లు
నెల్లూరు    –    రూ. 0.18 కోట్లు

ఏపీ, తెలంగాణ ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఈ చిత్రం తొలి రోజు రూ. 4. 23 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు తెలిసింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 6 కోట్లు ప్రారంభ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. థియేట్రిక‌ల్ రైట్స్‌ని 23.81 కోట్ల‌కు అమ్మేశారు. ఆ మొత్తం వ‌సూలు చేయాలంటే మ‌రో 16 కోట్లు వ‌సూలు చేయాల్సిందే.