వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్


 

World famous lover first weekend collections report
World famous lover first weekend collections report

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన సంగతి తెల్సిందే. మొదటి రోజే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రాగా దానికి తగ్గట్లుగానే చిత్ర కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 4.5  కోట్ల షేర్ ను వసూలు చేయగా వీకెండ్ ముగిసేసరికి 7 కోట్ల షేర్ ను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపు 23 కోట్ల మేర బిజినెస్ చేసింది.

ఈరోజు నుండి ఈ చిత్రానికి వచ్చే కలెక్షన్స్ కీలకం కానున్నాయి. ఒకవేళ ఈరోజు నుండి కలెక్షన్స్ స్టడీగా ఉంటే వరల్డ్ ఫేమస్ లవర్ సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండకు ఎంత స్టామినా ఉందనే దానిపై ఈ చిత్ర విజయం ఆధారపడి ఉంది. చూస్తుంటే అవకాశాలు తక్కువగానే ఉన్నట్టున్నాయి. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటించారు. రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్ కాగా క్యాథెరిన్, ఇజబెల్, ఐశ్వర్య రాజేష్.. కథల్లో భాగంగా వస్తారు. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో గౌతమ్ అనే ఒక రచయితగా కనిపించిన సంగతి తెల్సిందే.

ఒక కథలో భాగంగా వచ్చేశీనయ్య, సువర్ణల ట్రాక్ పై ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ కనబరుస్తున్నారు. ఇదే టైప్ లో సినిమా మొత్తం ఉండి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వరల్డ్ ఫేమస్ లవర్ వీకెండ్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :

నైజాం : Rs 3.51 కోట్లు

సీడెడ్ : Rs 63 లక్షలు

ఉత్తరాంధ్ర : Rs 71 లక్షలు

ఈస్ట్ : Rs 47 లక్షలు

వెస్ట్ : Rs 37 లక్షలు

గుంటూరు : Rs 62 లక్షలు

కృష్ణ : Rs 40 లక్షలు

నెల్లూరు : Rs 26 లక్షలు

ఆంధ్ర + తెలంగాణ :  Rs 6.97 కోట్లు.