`వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` న‌ష్టాలు ఎంత‌?

`వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` న‌ష్టాలు ఎంత‌?
`వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` న‌ష్టాలు ఎంత‌?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎస్‌. రామారావు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్‌పై క్రేజీ చిత్రంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచింది. భారీ వ‌సూళ్ల‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు సాధిస్తుంటాయి. అయితే ఆ రికార్డుల్ని ఈ చిత్రం తిర‌గ‌రాసి వ‌సూళ్ల ప‌రంగా భారీ న‌ష్టాల‌ని అందించింది.

దీంతో బ‌య్య‌ర్లు త‌మ డ‌బ్బు తిరిగి ఇవ్వాల‌ని నిర్మాత‌ని అడ‌గ‌డం మొద‌లుపెట్టారు. కొంత మంది మ‌రీ అడ్వాన్స్ అయ్యారు కూడా. 30 కోట్ల‌కు బిజినెస్ అయిన ఈ చిత్రం క్లోజింగ్ క‌లెక్ష‌న్స్ మ‌రీ షాకిస్తున్నాయి. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల‌కు పైనే వ‌సూలు చేసింది. ఇక ఓవ‌ర్సీస్‌లో మాత్రం కోటి దాట‌క‌పోవ‌డంతో అక్క‌డి వారికి భారీ స్థాయిలో న‌ష్టాలొచ్చాయి.

మొత్తంగా చూస్తే 30 కోట్ల‌కు అమ్మిన ఈ చిత్రం రాబ‌ట్టింది మాత్రం కేవ‌లం 9 కోట్ల పై చిలుకు మాత్ర‌మే. అంటే దాదాపు బ‌య్య‌ర్స్‌కి 21 కోట్లు న‌ష్టం వ‌చ్చింద‌న్న‌మాట. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయ్యాల‌ని నిర్మాత‌ని అడుగుతున్నార‌ట‌. అయితే త‌న త‌దుప‌రి చిత్రాన్ని త‌క్కువ రేట్ల‌కి ఇచ్చేస్తాన‌ని నిర్మాత న‌చ్చ‌జెబుతున్నాడ‌ట‌. బయ్య‌ర్స్ మాత్రం ఆయ‌న మాట‌ని విన‌డం లేద‌ని తెలిసింది.