వరల్డ్ ఫేమస్ లవర్.. దేవరకొండ చేతుల్లోనే అంతా!

వరల్డ్ ఫేమస్ లవర్.. దేవరకొండ చేతుల్లోనే అంతా!
వరల్డ్ ఫేమస్ లవర్.. దేవరకొండ చేతుల్లోనే అంతా!

విజయ్ దేవరకొండ కు యూత్ లో క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు వసూళ్లు అదిరిపోతాయి. అయితే సినిమా ఫలితం మాత్రం కంటెంట్ మీద ఆధారపడాలి. విజయ్ నటించిన లాస్ట్ సినిమా డియర్ కామ్రేడ్ ప్లాప్ అయిన నేపథ్యంలో తన లేటెస్ట్ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ తో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా నేడే విడుదల కానుంది.

చాలా తక్కువ సినిమాలతోనే విజయ్ కు స్టార్ డం వచ్చేసింది. హిట్ అయిన సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్స్ కావడంతో విజయ్ ఇమేజ్ అమాంతం పెరిగింది. అందులోనూ విజయ్ దేవరకొండ చేసే పనులకు యూత్ ఫిదా అయిపోయారు. రౌడీ అనే ట్యాగ్ లైన్ ను విజయ్ వాడుకోవడంతో ఇన్స్టంట్ గా వాళ్లకు కనెక్ట్ అయిపోయారు. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి అన్నీ తానై వ్యవహరించాడు విజయ్. ఈ చిత్రానికి తనే క్రౌడ్ పుల్లర్.

ఈ సినిమా ద్వారా విజయ్ కు పెద్ద టార్గెట్ ఉంది. దాదాపు 30 కోట్ల మేర వసూలు చేయాలి. అయితే టాక్ బాగుంటే ఈ మొత్తం విజయ్ కు పెద్ద కష్టం కాకపోవచ్చు. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి మొదటి టాక్ ఎలా ఉంటుంది అన్న అంశం మీదే ఈ చిత్ర కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకుడు. ఇతని లాస్ట్ సినిమా ప్లాపైనా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి అభిరుచి కల చిత్రాలను డైరెక్ట్ చేసాడు. ఈ నేపథ్యంలో మరో లవ్ స్టోరీతో రావడం, అందులోనూ నాలుగు హీరోయిన్లు ఇందులో విజయ్ తో జతకట్టడం వంటి కారణాలతో చిత్రంపై బజ్ బాగానే ఉంది. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి తొలిరోజు బుకింగ్స్ బాగున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఈసారి ఏం చేస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది.