విజయ్ ప్లాప్ సినిమా.. ఇప్పుడక్కడ రీమేక్



విజయ్ ప్లాప్ సినిమా.. ఇప్పుడక్కడ రీమేక్
విజయ్ ప్లాప్ సినిమా.. ఇప్పుడక్కడ రీమేక్

విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ ఎంత పెద్ద ప్లాప్ అయిందో మనందరికీ తెలుసు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో విఫలమైంది. ప్రేమికుల రోజున ఈ చిత్రం విడుదల కాగా మొదటి వీకెండ్ దాటిన దగ్గరనుండి బాగా స్లో అయ్యి చివరికి సింగిల్ డిజిట్ షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ ను తక్కువ బడ్జెట్ లో ఏం తీయలేదు. విజయ్ మార్కెట్ కు మించి ఖర్చుపెట్టారు. విదేశాల్లో సైతం షూటింగ్ చేసారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండకు ఈ ప్లాప్ బాగా ఎఫెక్ట్ చూపించింది. డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ సినిమాకు వచ్చిన నష్టాలను పూడ్చాలని హీరో, నిర్మాత వద్దకు వచ్చారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హక్కులు ఫ్యాన్సీ ధరకు అమ్ముడుపోవడం విశేషం. వరల్డ్ ఫేమస్ లవర్ రీమేక్ ను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమా తెలుగులో ప్లాప్ అయినా కానీ హిందీ జనాలకు ఈ కాన్సెప్ట్ నచ్చుతుందని చెప్పి కరణ్ కొనుక్కున్నాడు. గతంలో మరో విజయ్ దేవరకొండ సినిమా డియర్ కామ్రేడ్ సినిమాను విడుదలకు ముందే కొనుగోలు చేసాడు కరణ్. అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో రీమేక్ జోలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు సినిమా ప్లాప్ అయినా రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. షూటింగ్ శరవేగంగా సాగిన ఈ చిత్రానికి కరణ్ జోహార్ ఒక నిర్మాతగా ఉన్నాడు. ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజవుతోంది. ఇటీవలే ముంబై లో 40 రోజుల షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ వచ్చారు. మరో షెడ్యూల్ ను మొదలుపెట్టాల్సి ఉండగా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ లు జరగట్లేదు కాబట్టి వాయిదా వేశారు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.