లండన్ చెక్కేయనున్న వరల్డ్ ఫేమస్ లవర్


Vijay Devarakonda
లండన్ చెక్కేయనున్న వరల్డ్ ఫేమస్ లవర్

విజయ్ దేవరకొండ కెరీర్ ఒక హిట్టు, ఒక ప్లాప్ అన్నట్లుగా సాగుతోంది. ఇటీవలే వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా చేదు ఫలితాన్ని మిగిల్చిన నేపథ్యంలో విజయ్ తదుపరి సినిమా కచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకంలో ఉన్నారు రౌడీ ఫ్యాన్స్. లేటెస్ట్ గా విజయ్ నటిస్తున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. టైటిల్ చూసి సినిమా చాలా క్లాసిగా ఉంటుందన్న భావన కలిగించినా ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ అందుకు భిన్నంగా ఉంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కి సంబంధించి రెండు షెడ్యూల్స్ ప్లాన్ చేసాడు దర్శకుడు క్రాంతి మాధవ్. వచ్చే నెల రెండో వారం నుండి వరల్డ్ ఫేమస్ లవర్ లండన్ షెడ్యూల్ మొదలవుతుంది. దాని తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ కూడా ప్లాన్ చేసారు. దీంతో షూటింగ్ మొత్తం ఓ కొలిక్కి వస్తుందని సమాచారం.

విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వస్తాయి.