ఆర్టికల్ 370 రద్దు షాక్ అయిన వరల్డ్ మీడియా ?Article 370
Article 370

జమ్మూ కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హోదా ని ఆర్టికల్ 370 రద్దుపై ప్రధాని నరేంద్ర మోడీఅమిత్ షా తీసుకున్న సంచలనం నిర్ణయంతో ప్రపంచ మీడియా ఒక్కసారిగా షాక్ అయ్యింది . వారం , పదిరోజులుగా జరుగుతున్న తతంగంతో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ఉండొచ్చని అంతా భావించారు కానీ ఊహ వేరు , వాస్తవం వేరు దాంతో ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .

ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి తప్ప సానుకూలపడవని అభిప్రాయపడుతోంది గ్లోబల్ మీడియా . కాశ్మీరీల మనసు గెలుచుకోవడం ఇలా కాదని , దీనివల్ల లోయలో మరింత అల్లకల్లోలం జరగడం ఖాయమని అంటున్నాయి . అయితే భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల సానుకూలంగా ఉన్న దేశాలు కూడా ఉన్నాయి . 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ధైర్యంగా కేంద్రం ముందగుడు వేసిందని , దీని వల్ల తప్పకుండా సానుకూల ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి .