ఈ వాచ్ ఖరీదు కేవలం రూ. 226 కోట్లు మాత్రమే


Wrist watch Worth Rs. 226 Croes
Wrist watch Worth Rs. 226 Croes

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో ఒక సూపర్ డైలాగ్ ఉంటుంది. హీరోకి ఎంత ఆస్తి  ఉంటుందని కమెడియన్ దొంగ హీరోయిన్ సమంత అడిగితే, హీరోయిన్ చెప్పే డైలాగ్

“వాడి చేతికి ఉన్న  వాచ్ అమ్మితే మీ లైఫ్  సెటిల్ అయిపోతుంది”

కొంచెం అటు ఇటు గా దానికి సంబంధం ఉన్న వార్త ఇప్పుడు ఒకటి ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది ఏమిటి అంటే, చేతి గడియారం ధర 226 కోట్లు.

నిజం నేను చెప్పింది కేవలం ఒక మనిషి చేతికి పెట్టుకునే గడియారాన్ని 226 కోట్లు పెట్టి ఒకళ్ళు కొన్నారు. కొన్న వ్యక్తి వివరాలు ఇప్పటి వరకు బయటికి తెలియలేదు కానీ సదరు చేతి గడియారాన్ని తయారు చేసిన సంస్థ తాలూకు వివరాలు బయటకు వచ్చాయి

ఆ వాచ్ మోడల్ పేరు  గ్రాండ్ మాస్టర్ చైమ్ 6300 ఎ – 010.

తయారు చేసిన సంస్థ పటేక్ ఫిలిప్ అనే స్విట్జర్లాండ్ కంపెనీ

స్విజర్లాండ్ దేశం రాజధాని జెనీవాలో జరిగిన ఒక చారిటీ కి సంబంధించిన వేలం పాటలో ఈ గడియారం 226 కోట్లకు అమ్ముడుపోయింది.

గడియారం ప్రత్యేకతలు : 5 ముల్లులు,  2 టైం జోన్ లు,  నాలుగు అంకెల లో సంవత్సరం యొక్క వివరాలతో పాటు, నిమిషాలయ్యాక కనిపించే సబ్ డయల్ సహా మరో 20 రకాల ప్రత్యేకతలు ఉన్నాయి.

చేతి వాచీ అనేది రూ.220  పెట్టి కొన్నా, లేదా 226 కోట్లు పెట్టి కొన్నా అదే టైం చూపిస్తుంది కదా.! మరి ఈ గడియారం కూడా అలాంటిదే నా లేక, ఈ మధ్య కాలంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన 24 సినిమా లో చూపించిన విధంగా భవిష్యత్తులో ముందుకి వెనక్కి వెళ్లేలా డిజైన్ చేసిన టైం మిషన్ వాచ్ ఆ.? అనే విషయం మాత్రం దయచేసి అడగకండి.