కోన వెంకట్ తిట్టేది ఆ హీరో నేనా


writer kona venkat comments on sivajiరచయిత కోన వెంకట్ మళ్ళీ ట్విట్టర్ కెక్కాడు అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద , ఒక హీరో మీద కామెంట్ చేసాడు . ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని కేంద్రంతో ఇప్పుడు పోరాడుతోంది ఏపీ ప్రభుత్వం అయితే నాలుగేళ్లుగా మాత్రం ప్రత్యేక హోదా అవసరం లేదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలు అని గగ్గోలు పెట్టింది కట్ చేస్తే ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం ఏపీ ని మోసం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది .

అయితే ఇందులో శివాజీ అనే హీరో కొంతకాలంగా స్పెషల్ స్టేటస్ కోసం గట్టిగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే . అయితే అతడు ఇటీవల ఏపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లుగా అతడి మాటలు ఉంటుండటం తో పాటు పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా ఆరోపణలు చేస్తుండటంతో రంగంలోకి దిగాడు కోన వెంకట్ . ఎంతైనా పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడు కోన అందుకే శివాజీ పేరు ఎక్కడా ఎత్తకుండా విమర్శలు గుప్పించాడు .