బిగ్ బాస్ షోపై ఆగ్రహం వ్యక్తం చేసిన కామ్రేడ్


Writer paruchuri gopalakrishna fires on bigg boss 2 show

బిగ్ బాస్ 2 షో మొదట నాకు బాగా నచ్చిందని కానీ రాను రాను అది వికృతరూపం దాల్చడం మన భారతీయ సంస్కృతీని కించపరచడమే అంటూ ఆ షోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ప్రముఖ రచయిత , కామ్రేడ్ పరుచూరి గోపాలకృష్ణ . మగవాళ్ళు , ఆడవాళ్లు ఇద్దరూ సమానమే అయితే శరీర ఆకృతిలో మాత్రం మార్పులు ఉన్నాయని అందుకే వాళ్లకు వేరువేరుగా పోటీలు ఉండాలని అంతేకాని మగవాళ్లతో పాటుగా మహిళలకు కలిపి పోటీ పెట్టడం దారుణమని బిగ్ బాస్ నిర్వాహకుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు పరుచూరి గోపాలకృష్ణ . బిగ్ బాస్ 2 షోకి నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే .

అంతేకాదు బ్రతికున్న వాళ్ళ ఫోటోలను కాల్చివేయడం మంచి పద్దతి కాదని , అందుకే బిగ్ బాస్ షో చూస్తున్న నా భార్య ని వెంటనే టివి ఆఫ్ చేయమని గట్టిగా చెప్పానని …… మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేలా కార్యక్రమాలు ఉండాలి కానీ ఇలా నాశనం చేసేలా ఉండకూడదని నిప్పులు చెరుగుతున్నాడు పరుచూరి గోపాలకృష్ణ . వందలాది చిత్రాలకు కథ , సంభాషణలు అందించిన చరిత్ర పరుచూరి గోపాలకృష్ణది . అయితే ప్రస్తుతం కథారచయితగా రేసులో వెనుకబడిపోయాడు . అయితే చిరంజీవి నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న ” సైరా …… నరసింహారెడ్డి ” చిత్రానికి కథ అందించింది పరుచూరి బ్రదర్స్ కావడం విశేషం .

English Title: Writer paruchuri gopalakrishna fires on bigg boss 2 show