కాలా డిజాస్టర్ కానీ.. హిట్ అని రజనీ కి చెప్పారట


wrong feed back to rajinikanth on kaala

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం డిజాస్టర్ అయ్యింది . జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన కాలా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసింది . భారీ రేట్ల కు కాలా చిత్రాన్ని కొనుకున్న బయ్యర్లు ఘోరంగా నష్టపోతున్నారు . ఒక్క తమిళనాట మాత్రమే కాలా మంచి వసూళ్లు సాధిస్తోంది మిగతా అన్నిచోట్లా ఘోర పరాజయం పాలయ్యింది . అయితే ఇంత దారుణంగా కాలా పరిస్థితి ఉండగా రజనీకాంత్ కు మాత్రం కాలా మంచి హిట్ అయ్యిందని , మంచి వసూళ్లు సాధిస్తోందని చెప్పారట !

సూపర్ స్టార్ రజనీకాంత్ కు కాలా ప్లాప్ అయిన సంగతి తెలియకుండా జాగ్రత్తపడుతున్నారట ధనుష్ అండ్ కో అంతేకాదు హీరో గారి స్టాఫ్ కూడా . అన్ని చోట్లా మంచి వసూళ్లు వస్తున్నాయని చెప్పడంతో నిజంగానే కాలా హిట్ అని అనుకుంటున్నాడు రజనీకాంత్ . అయితే ఇలా ఎన్నిరోజులు మేనేజ్ చేస్తారు ? మరో వారం రోజుల్లోనో , నెల రోజుల్లోనో అసలు నిజం తెలిసిపోతుంది కాలా డిజాస్టర్ అన్న విషయం . అసలు విషయం తెలియని రజనీకాంత్ మాత్రం కాలా హిట్ అయ్యిందని అంటున్నాడు పాపం .