
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ `118`. మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఆకట్టుకోవడంతో తెలుగులో తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని దక్కించుకున్నారు కె.వి.గుహన్. ఈ మూవీ తరువాత మళ్లీ ఆయన మరోసారి థ్రిల్లర్ కథనే ఎంచుకున్నారు. అయితే ఈ సారి సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ని ఎంచుకున్నారు.
కె.వి. గుహన్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` (ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఆదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. డా. రవి, పి. రాజు దాట్ల సంయుక్తంగా ఈ సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో రానా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ని స్టార్ హీరో సూపర్‌స్టార్ మహేష్ విడుల చేశారు.
టీజర్, విజువల్స్ ఆసక్తికరంగా ఆకట్టుకుంటున్నాయి. నలుగురు స్నేహితులు వీడియోకాల్ మాట్లాడుతుంటారు. ఇంతలో ఊహించని పరిణామం.. ఎవరో వాళ్ల కాల్ని హ్యాక్ చేశారు. వారి పాస్వర్డ్స్.. ఇతర సమాచారం హ్యాకర్స్ హ్యాక్ చేశారు. అందులో హీరో హీరోయిన్లు ఏకాంతంగా మాట్లాడుకున్న సంభాషణలు కూడా వున్నాయి. ఇది ఖచ్చితంగా బ్రూట్ ఫోర్స్ ఎటాక్` అని టీజర్లో డైలాగ్స్ వినిపిస్తున్నాయి. గుహన్ పేరున్నటెక్నీషియన్ కావడంతో టెక్నికల్‌గా ఈ చిత్రాన్ని ఉన్నతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ చిత్రం కె.వి. గుహన్‌కు మరో హిట్‌ని అందించేలా వుంది. ప్రియదర్శి, రాజ్‌కుమార్ సతీష్, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.