బూతు …. బూతు మొత్తం ట్రైలర్ బూతు


XXX uncensored trailer out

వెబ్ సిరీస్ లలో సంచలనం సృష్టించడానికి వస్తోంది ” ట్రిపుల్ ఎక్స్ అన్ సెన్సార్డ్ ” . ఏక్తా కపూర్ ఒక మహిళ అయినప్పటికీ బూతు చిత్రాలు నిర్మిస్తూ బాగానే సొమ్ము చేసుకుంటోంది . ఇప్పటికే బాలాజీ ఫిలిమ్స్ పతాకంపై పలు చిత్రాలను అలాగే సీరియల్ లని నిర్మించింది ఏక్తా కపూర్ , అయితే గతకొంత కాలంగా అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే నిర్మిస్తూ భారీగా లాభాలు పొందుతోంది . ఇక నిన్న మొన్నటి వరకు చిత్రాలను మాత్రమే నిర్మించిన ఈ అడల్ట్ భామ తాజాగా వెబ్ సిరీస్ లో కూడా బూతు ని పీక్స్ కి తీసుకెళ్లేలా ” ట్రిపుల్ ఎక్స్ అన్ సెన్సార్డ్ ” అనే వెబ్ సిరీస్ ని నిర్మించింది .

ఇక తాజాగా ఆ వెబ్ సిరీస్ ట్రైలర్ ని విడుదల చేసారు . ట్రైలర్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం , నోరెళ్ళ బెడుతూ ఆశ్చర్యపోవడం ఖాయం అంత బూతు ఉంది ట్రైలర్ నిండా . మొత్తానికి శృంగార రసాత్మక వెబ్ సిరీస్ కు శ్రీకారం చుట్టి షాక్ ఇస్తోంది ఏక్తా కపూర్ . కైరా దత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ ట్రిపుల్ ఎక్స్ అన్ సెన్సార్డ్ లో శృంగార సన్నివేశాలకు కొదవలేదు . అన్నట్లు ఈ కైరా దత్ బాలయ్య హీరోగా నటించిన పైసా వసూల్ చిత్రంలో నటించింది . ఈ వెబ్ సిరీస్ ఏక్తా కపూర్ కు కాసుల వర్షం కురిపించడం ఖాయమని తెలుస్తోంది ట్రైలర్ చూస్తుంటేనే .

English Title: XXX uncensored trailer out