ఒకే వేదిక‌పై రాఖీభాయ్‌..రౌడీ భాయ్‌..!Yash and Vijay Devarakonda same stage
Yash and Vijay Devarakonda same stage

క‌న్న‌డ స్టార్ య‌ష్ `కేజీఎఫ్‌` చిత్రంతో ఓవ‌ర్ నైట్‌లోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. రాఖీ భాయ్ పాత్ర‌లో ఆక‌ట్టుకుని దేశ వ్యాప్తంగా కేజీఎఫ్ చాప్ట‌ర్-1 తో సంచ‌ల‌నం సృష్టించారు. యాక్ష‌న్ స్టార్‌గా క‌న్న‌డ  ప‌రిశ్ర‌మ‌లో పేరు తెచ్చుకున్న య‌ష్‌కు `కేజీఎఫ్‌` స్టార్ హీరో స్టేట‌స్‌ని తెచ్చి పెట్టింది. ప్ర‌స్తుతం `కేజీఎఫ్ చాప్ట‌ర్-2 చిత్రంలో న‌టిస్తున్న య‌ష్ తాజాగా చెన్నైలో జ‌రిగిన ఓ అవార్డుల వేడుక‌లో పాల్గొన్నారు. ఇదే ఫంక్ష‌న్‌లో రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పాల్గొన్నారు. య‌ష్ త‌ర‌హాలోనే విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఒకే సినిమాలో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు.

`అర్జున్‌రెడ్డి` వంటి సంచ‌ల‌న చిత్రంతో విజ‌య్ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయిన విష‌యం తెలిసిందే. ఈ ఇద్ద‌రు హీరోలు ఇటీవ‌ల ఒకే వేదిక‌ను పంచుకున్నారు. `డియ‌ర్ కామ్రేడ్‌` చిత్రానికి గానూ విజ‌య్ దేవ‌ర‌కొండ ఉత్త‌మ న‌టుడిగా అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును య‌ష్ అంద‌జేయ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంది. ఒకే సినిమాతో వండ‌ర్స్ క్రియేట్ చేసిన య‌ష్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఒకే వేదిక‌ను పంచుకోవ‌డంతో ఆ దృశ్యాన్ని చూసిన వారంతా రాఖీ భాయ్‌… రౌడీ భాయ్ అని అభివ‌ర్ణించార‌ట‌.