ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో రాఖీ భాయ్ హంగామా!


ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో రాఖీ భాయ్ హంగామా!
ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో రాఖీ భాయ్ హంగామా!

`కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` సైలెంట్‌గా వ‌చ్చి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. యష్ ని పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` తెర‌కెక్కుతోంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం కోసం చాలా స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ని ద‌ర్శ‌కుడు సిద్ధం చేస్తున్నాడు. బాలీవుడ్ కు చెందిన స్టార్స్ సంజ‌య్‌ద‌త్‌ని కీల‌క విల‌న్‌గా. ర‌వీనా టాండ‌న్‌ని మాజీ ప్ర‌ధాని ర‌మికా సేన్‌గా రంగ‌వ‌లోకి దించేశాడు.

ఇటీవ‌ల కీల‌క ఘ‌ట్టాల్ని మైసూర్‌లో పూర్తి చేసిన ప్ర‌శాంత్ నీల్ మ‌రో కీల‌క ఎపిసోడ్‌ని హైద‌రాబాద్‌లోని తాజ్ ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో తెర‌కెక్కిస్తున్నాడు. ఈ ప్యాలెస్‌లో ఓ కాస్ట్‌లీ సాంగ్‌ని షూట్ చేస్తున్నార‌ట‌. ఈ పాట కోసం భారీగానే మేక‌ర్స్ ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు మీడియా వ‌ర్గాల రిపోర్ట్‌. లీక్‌ల కార‌ణంగా తాజ్ ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్‌లోకి ఇత‌రుల్ని ముఖ్యంగా మీడియాని అనుమంతించ‌డం లేద‌ని తెలిసింది. ఈ పాట సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంద‌ని చెబుతున్నారు.

శ్రీ‌నిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంపై ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాది ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డు సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోందని, ఈ చిత్రాన్నిజూలైలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ అది ఓ నెల ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని. ఆగ‌స్టులో ఈ చిత్రం రిలీజ్ అవుతుంద‌ని క‌న్న‌డ వ‌ర్గాలు చెబుతున్నాయి.