రాఖీభాయ్ కూడా అక్క‌డే ఎంజాయ్ చేస్తున్నాడు!

రాఖీభాయ్ కూడా అక్క‌డే ఎంజాయ్ చేస్తున్నాడు!
రాఖీభాయ్ కూడా అక్క‌డే ఎంజాయ్ చేస్తున్నాడు!

సమంత, కాజల్ అగర్వాల్, తాప్సీ, నిహారికా మరియు ఇతర నటీమణులు మాల్దీవులకు వెళ్లి అక్కడి  రిసార్టులలో ఎంజాయ్ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో మాల్దీవుల‌కు ఈ మ‌ధ్య కాలంలో భారీ క్రేజ్ ఏర్ప‌డింది. మాల్దీవుల్లోని దీవుల్లో ఎంజాయ్ చేసిన ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకుని సంద‌డి చేశారు.
కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న హ‌నీమూన్ కోసం ఏకంగా భారీ ప్యాకేజ్‌ని ప్ర‌క‌టించి భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో అక్క‌డి రిసార్ట్‌ల‌లో ఎంజాయ్ చేయ‌డం తెలిసిందే.

కాజ‌ల్ అండ‌ర్ వాట‌ర్ బెడ్ రూమ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే. దీంతో మాల్దీవ్‌ల‌లో ఎంజాయ్ చేయాల‌ని, అక్క‌డి అందాల్ని ఆస్వాదించాల‌ని ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రు కోరుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో `కేజీఎఫ్‌` ఫేమ్ రాఖీభాయ్ య‌ష్ కూడా చేరారు. `కేజీఎఫ్‌2` చిత్రీక‌ర‌ణతో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపిన య‌ష్ తాజాగా త‌న ఫ్యామిలీలో క‌లిసి మ‌ల్దీవుల‌కు వెకేష‌న్‌కి వెళ్లారు.

భార్య రాధికా పండిట్ త‌న ఇద్ద‌రు పిల్ల‌లో క‌లిసి వెకేష‌న్ కోసం ప్ర‌త్యేకంగా మాల్దీవుల‌కు వెళ్లారు య‌ష్. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు వైర‌ల్గా మారాయి. ‘కేజీఎఫ్’ భారీ విజయంతో దేశవ్యాప్తంగా పాపుల‌ర్ అయిన‌ స్టార్ యష్ అక్కడ విహారయాత్ర చేస్తున్న తాజా స్టార్ కావ‌డం విశేషం. య‌ష్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘కేజీఎఫ్ 2’. షూటింగ్ పూర్త‌యింది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ ఇప్ప‌టికీ సంచ‌ల‌నాలు సృష్టిస్తూనే వుంది. ఈ చిత్నాన్ని ఏప్రిల్ లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)