`కేజీఎఫ్‌` హీరో అభిమాని ఆత్మ‌హ‌త్య‌!

`కేజీఎఫ్‌` హీరో అభిమాని ఆత్మ‌హ‌త్య‌!
`కేజీఎఫ్‌` హీరో అభిమాని ఆత్మ‌హ‌త్య‌!

క‌న్న‌డ స్టార్ య‌ష్ `కేజీఎఫ్‌` చిత్రంతో రాత్రికి రాత్రి పాన్ ఇండియా స్థార్‌ల జాబితాలో చేరిపోయారు. ద‌క్షిణాది నుంచి ప్ర‌భాస్ త‌రువాత స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీతో య‌ష్‌కి దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. దీంతో య‌ష్ న‌టిస్తున్న `కేజీఎఫ్ చాప్ట‌ర్‌2`పై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఇదిలా వుంటే హీరో య‌ష్ అభిమాని ఒక‌రు ఆత్మ హ‌త్య‌కు పాల్ప‌డ‌టం సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. మాండ్య జిల్లాలోని కూడిదొడ్డికి గ్రామానికి చెందిన 25 ఏళ్ల రామ‌కృష్ణ అనే ఓ అభిమాని త‌న నివాసంలో ఆత్మ‌ హ‌త్య చేసుకున్నాడు. య‌ష్‌కి ఇత‌ను డైహార్డ్ ఫ్యాన్‌. అంతే కాకుండా క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధారామ‌య్య‌కు వీరాభిమాని.

ఈ ఇద్ద‌రూ త‌న అంతిమ సంస్కారాల‌కి హజరు కావాల‌ని అదే త‌న చివ‌రి కోరిక అని అభిమాని రామ‌కృష్ణ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. అభిమాని ఆత్మ హ‌త్యపై హీరో య‌ష్ స్పందించారు. మేము న‌టులం మీ నుంచి విజిల్స్‌ని, క్లాప్స్‌ని  కోరుకుంటామో కానీ ఇలాంటి ప‌నిని అస్స‌లు ఊహించం` అని ఎమోష‌న‌ల్ అయ్యారు.