ఏకంగా నేష‌న‌ల్ హాలీడే కావాలంటున్నారు!

yash fans funny request to pm modi for kgf 2
yash fans funny request to pm modi for kgf 2

`కేజీఎఫ్‌`తో మోన్‌స్ట‌ర్‌లా దూసుకొచ్చిన క‌న్న‌డ స్టార్ య‌ష్‌. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ చిత్ర ఈ ఇద్ద‌రినీ పాన్ ఇండియా స్థాయిలో పాపుల‌ర్ చేసింది. దీంతో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రానున్న `కేజీఎఫ్‌2`పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. హొంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

‌దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్రాన్ని జూలై 16న వ‌ర‌ల్డ్ వైడ్‌గా క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.  ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్ ట్రైల‌ర్ రేంజ్‌లో విజువ‌ల్ వండ‌ర్‌గా నిల‌వ‌డం.. ఇప్ప‌టికే యూట్యూబ్‌లో 160 ప్ల‌స్ వ్యూస‌ని దాటి రికార్డులు సృష్టిస్తుండ‌టంతో టీజ‌రే ఈ రేంజ్‌లో వుంటే సినిమా ఇంకెలా వుంటుందో అని ఈ మూవీ కోసం య‌ష్ ఫ్యాన్స్ వేయి కళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ రోజైన జూలై 16న నేష‌న‌ల్ హాలీడే ప్ర‌క‌టించాల‌ని య‌ష్ ఫ్యాన్స్ వింత కోరిక కోరుతున్నారు. ఏకంగా ఆ రోజుని నేష‌న‌ల్ హాలీడేగా ప్ర‌క‌టించాల‌ని కోరుతూ ప్ర‌ధాని మోదీని రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఇది నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది.