`కేజీఎఫ్ 2` రిలీజ్ డేట్ మారిందా?

`కేజీఎఫ్ 2` రిలీజ్ డేట్ మారిందా?
`కేజీఎఫ్ 2` రిలీజ్ డేట్ మారిందా?

కేజీఎఫ్ తొలి భాగం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ గురించి యావ‌త్ భార‌తం చ‌ర్చంచుకునేలా చేసింది బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించిన ఈ చిత్రానికి ప్ర‌స్తుతం య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్ పార్ట్ 2ని చేస్తున్న విష‌యం తెలిసిందే. యంగ్ ప్రొడ్యూస‌ర్ అహొంబ‌లే ఫిలింస్ అధినేతి విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల విడుద‌లై ఈ చిత్ర టీజ‌ర్ ఇప్ప‌టికే 150 మిలియ‌న్ వ్యాస్ దాటి స‌రికొత్త చరిత్ర‌ని సృష్టిస్తోంది. రిలీజైన 24 గంట‌ల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌ని రాబ‌ట్టి `కేజీఎఫ్ 2` స‌రికొత్త సంచ‌ల‌నాల‌కు తెర‌లేపింది. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దీంతో ఈ మూవీ రిలీజ్‌పై ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

ఈ మూవీ రిలీజ్ డేట్ మారింద‌ని, ఏప్రిల్‌లో కాకుండా ఈ మూవీ మే 30న రిలీజ్ అవుతోందంటూ వార్త‌లు షికారు చేయ‌చ‌డం మొద‌లైంది. అయితే ఈ వార్త‌ల‌పై మాత్రం మేక‌ర్స్ స్పందించ‌డం లేదు. శ్రీ‌నిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో ర‌వీనా టాండ‌న్, న్ర‌కాష్‌రాజ్‌, రావు ర‌మేష్‌, సంజ‌య్‌ద‌త్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. భారతీయ సినీ చ‌రిత్ర‌లో `కేజీఎఫ్ 2` స‌రికొత్త చ‌రిత్ర‌ని సృష్టించ‌డం ఖాయం అని చెబుతున్నారు.