బాహుబలిని బద్దలు కొట్టనున్న కేజీఎఫ్

Yash KGF record collections in karnataka
Yash

బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్దమయ్యింది ఓ కన్నడ చిత్రం . కన్నడంలో స్టార్ గా ఎదుగుతున్న యువ హీరో యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ సంచలన విజయం సాధిస్తోంది . ఒక్క కన్నడంలోనే కాకుండా తెలుగు , తమిళ , హిందీ బాషలలో భారీ ఎత్తున విడుదలయ్యింది కేజీఎఫ్ . ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించింది కేజీఎఫ్ చిత్రం , ఇక కర్ణాటకలో ఏకంగా 121 కోట్ల వసూళ్ల ని సాధించడంతో ట్రేడ్ విశ్లేషకులు మాత్రమే కాదు అక్కడి చిత్ర పరిశ్రమ యావత్తు ఖంగుతింది .

ఇంతవరకు కన్నడ సినిమా వంద కోట్ల వసూళ్ల ని సాధించలేదు అలాంటిది యంగ్ హీరో నటించిన కేజీఎఫ్ వంద కోట్లకు పైగా వసూళ్ల ని సాధించడం అలాగే ఇతర బాషలలో కూడా 80 కోట్లకు పైగా వసూల్ చేయడంతో షాక్ అవుతున్నారు . ఇక బాహుబలి విషయానికి వస్తే కర్ణాటకలో 129 కోట్లని వసూల్ చేసింది బాహుబలి , అయితే ఆ రికార్డ్ ని బద్దలు కొట్టడానికి యష్ కు ఎంతో సేపు పట్టేలా లేదు ఎందుకంటే ఇప్పటికే 121 కోట్ల వసూళ్ల ని రాబట్టింది , అంటే మరో వారం , పది రోజుల్లో బాహుబలి రికార్డ్ బద్దలు కావడం ఖాయమని అంటున్నారు అక్కడి ట్రేడ్ విశ్లేషకులు .

English Title: Yash KGF record collections in karnataka

SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4