యష్ తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో ఆసక్తికర అప్డేట్

యష్ తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో ఆసక్తికర అప్డేట్
యష్ తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో ఆసక్తికర అప్డేట్

కేజిఎఫ్ చాప్టర్ 1 చిత్రంతో నేషనల్ లెవెల్ స్టార్ అయిపోయాడు యష్. దేశవ్యాప్తంగా ఇప్పుడు యష్ కు ఫ్యాన్స్ ఉన్నారు. కేజిఎఫ్ చాప్టర్ 2 ను కూడా పూర్తి చేసాడు ఈ హీరో. కేజిఎఫ్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మరిన్ని రికార్డులను పడగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే కేజిఎఫ్ తర్వాత యష్ ఏ సినిమా చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. నార్తన్ దర్శకత్వంలో యష్ తన నెక్స్ట్ సినిమాకు కమిటయ్యాడు. కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంబేలె ఫిల్మ్స్, జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.

యష్ ఈ సినిమాలో నేవీ అధికారిగా కనిపిస్తాడని, ప్యాన్ ఇండియా లెవెల్లోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తారని తెలుస్తోంది. తమన్నాను హీరోయిన్ గా అనుకుంటున్నారు. అయితే ఇది ఇంకా అధికారికం కాదు. ఈ ప్రాజెక్ట్ గురించి మరింత క్లారిటీ రానున్న వారాల్లో వస్తుంది.