పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొంటే తప్పేంటి ?


Yashika aannand sensational comments on virginity 

పెళ్ళికి ముందు ఆడాళ్ళు శృంగారంలో పాల్గొంటే తప్పేంటని సూటిగా ప్రశ్నిస్తోంది విజయ్ దేవరకొండ హీరోయిన్ యాషిక ఆనంద్ . విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించింది ఈ భామ అయితే తమిళనాట శృంగార చిత్రాల్లో చాలా బోల్డ్ గా నటించి కుర్రాళ్ళ మతిపోగొట్టింది . శృంగార రసాత్మక చిత్రాల్లో నటించడమే కాదు చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది కూడా . పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొంటే తప్పేముంది అని నేరుగా ప్రశ్నిస్తోంది . మగవాళ్ళు అయితే శృంగారంలో పాల్గొనచ్చు కానీ ఆడవాళ్ళ మీదే ఆంక్షలా ? అయినా ఈరోజుల్లో ఆడవాళ్ళ ని కన్యగానే ఉండాలని కోరుకోవడం తప్పు అలాగే కొంతమంది మగాళ్లు ఆ ఆలోచన నుండి బయటకు వచ్చారని అయితే ఇంకా కొంతమంది అదే కన్యత్వం అంటూ పట్టుకు వెళ్ళాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది యాషికా ఆనంద్ .

ఈ భామ ఇంతగా రెచ్చిపోయి మాట్లాడటానికి కారణం ఏంటంటే ……. మగాళ్లేమో పెళ్ళికి ముందు రకరకాల ఎక్స్ పీరియన్స్ కోరుకుంటారు కానీ మా దగ్గరకు అ వచ్చేసరికి ఆంక్షలు పెడతారా ? అంటూ ప్రశ్నిస్తోంది యాషికా ఆనంద్ . ఆకాశంలో సగం అంటారు స్త్రీలను అందుకేనేమో మీలో సగం అయిన మాకు సమాన హక్కులు లేవా ? అంటూ ప్రశ్నిస్తోంది అంతేనా ……. గొంతెమ్మ కోర్కెలు చాలానే ఉన్నాయి ఈ భామకు .

English Title: Yashika aannand sensational comments on virginity