పెళ్ళైన హీరోని పెళ్లి చేసుకుంటానంటున్న భామ


Yashika anand wants to suriya

తమిళ స్టార్ హీరో సూర్య కు పెళ్ళైన విషయం తెలిసిందే . హీరోయిన్ జ్యోతిక ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సూర్య , ఇక ఈ ఇద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా . అయితే అలాంటి సూర్య ని పెళ్లి చేసుకొని కాపురం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసింది తమిళ నటి యషిక ఆనంద్ . ఈ భామ సినిమాల్లోకి వచ్చి చాలాకాలమే అవుతోంది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది , అయితే తాజాగా బిగ్ బాస్ పుణ్యమా అని హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది .

అయితే ఈ భామని ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నావ్ అంటూ  ఓ నెటిజన్ ప్రశ్న వేయగా దానికి ఏమాత్రం సంకోచించకుండా టక్కున సూర్య పేరు చెప్పేసింది . సూర్య అంటే నాకు ఎప్పటి నుండో ఇష్టమని అతడ్ని పెళ్లి చేసుకొని కాపురం చేస్తా అంటూ సెలవిచ్చింది ఇంకేముంది సూర్య అభిమానులకు విపరీతమైన కోపం వచ్చింది యాషిక ఆనంద్ పైన అంతే యాషిక ని తిట్టడం మొదలు పెట్టారు దాంతో భయపడిపోయింది ఈ భామ ఆ పోస్ట్ ని డిలీట్ చేసింది .

English Title: Yashika anand wants to suriya