యాత్ర పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే


 Yatra biopic public talk

మలయాళ  మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యాత్ర . కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది . మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాత్ర ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది . ఇక ఈ యాత్ర చిత్రానికి టాక్ ఎలా ఉందంటే …… రాజశేఖర్ రెడ్డి అభిమానులైతే యాత్ర చిత్రానికి ఫిదా అవుతున్నారు .

 

అయితే రెగ్యులర్ ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రం అంతగా సంతృప్తిని ఇవ్వడం లేదు . మిగతా వాళ్ళ విషయాన్నీ పక్కన పెడితే వై ఎస్సార్ అభిమానులు పార్టీ శ్రేణులకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చడం ఖాయం . రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించి ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంటున్నాడు . మొత్తానికి యాత్ర బయోపిక్ బాగానే ఉంది అయితే కామన్ ఆడియన్స్ కు నచ్చుతుందా అన్నది ప్రశ్న . ఒకవేళ వాళ్లకు కూడా నచ్చితే బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం .

English Title:  Yatra biopic public talk