యాత్ర డైరెక్టర్ రెండో చిత్రం టైటిల్ ఏంటో తెలుసా

Mahi V. Raghav
Mahi V. Raghav

ఆనందోబ్రహ్మ, యాత్ర వంటి డీసెంట్ హిట్స్ అందించి కేవలం రెండు చిత్రాలతోనే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు మహి వి.రాఘవ్.. లేటెస్ట్ గా ఆయన తన రెండో చిత్రం గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. అదియేమిటంటె మహి “సిండికేట్ ” అనే ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారని.. ఆ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త పివిపి (ప్రసాదే వి. పొట్లూరి) నిర్మిస్తారని హాట్ టాపిక్ న్యూస్ వినిపిస్తోంది. డైరెక్టర్ గా ఎలాంటి చిత్రాన్నైనా తీయగలనని నిరూపించుకున్న మహి వి.రాఘవ్ ఈ సిండికేట్ చిత్రాన్ని కూడా భారీ స్కేల్ లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ హీరోలు నటించనున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2020లో స్టార్ట్ అవుతుందని సమాచారం!!