యాత్ర రివ్యూ


yatra review
యాత్ర రివ్యూ

యాత్ర రివ్యూ :
నటీనటులు : మమ్ముట్టి , జగపతిబాబు , సుహాసిని , రావు రమేష్
సంగీతం : కృష్ణకుమార్
నిర్మాతలు : విజయ్ చిల్లా , శశి
దర్శకత్వం : మహి వి రాఘవ
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 8 ఫిబ్రవరి 2019

కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో తెరకెక్కిన చిత్రం ” యాత్ర ”. మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించాడు . ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది చూద్దామా !

కథ :

కడప కు చెందిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి ) ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి  68 రోజుల పాటు పాదయాత్ర ఎలా చేసాడు ? ఎలాంటి కష్టాలతో ప్రజలు బాధపడుతున్నారో తెలుసుకొని వాటి పరిష్కారానికి ఏం నిర్ణయాలు తీసుకున్నాడు . కడప కు చెందిన లీడర్ రాష్ట్ర ప్రజల మనసులను ఎలా గెల్చుకున్నాడు ….. తిరుగులేని మహా నాయకుడిగా ఎలా ఎదిగాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

మమ్ముట్టి

జగపతిబాబు

సుహాసిని

డైరెక్షన్

సంగీతం

విజువల్స్

డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్ లో కొన్ని సాగతీత సన్నివేశాలు

నటీనటుల ప్రతిభ :

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించాడు అనడం కంటే జీవించాడు , ప్రాణ ప్రతిష్ట చేసాడు అంటే సబబేమో ! అంతగా రాజశేఖర్ రెడ్డి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసాడు మమ్ముట్టి . ఒకానొక దశలో రాజశేఖర్ రెడ్డి నే గుర్తుకు తెచ్చాడు . మమ్ముట్టి నటనకు రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉప్పొంగిపోవడం ఖాయం . ఇక వై ఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు అభినయం కూడా అద్భుతంగా ఉంది . చేవెళ్ల చెల్లెమ్మగా సుహాసిని , అలాగే  విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి ఆయా పాత్రల్లో జీవించారు .ఇక  అనసూయ తో పాటుగా  ఇతర పాత్రల్లో నటించిన  ఆయా నటీనటులు  తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

తెరమీద మమ్ముట్టి ది వన్ మ్యాన్ షో అయితే తెరవెనుక వన్ మ్యాన్ ఆర్మీ మహి వి రాఘవ అనే చెప్పాలి . సెకండాఫ్ లో కొంచెం స్లో నెరేషన్ ఉన్నప్పటికీ సినిమా మొత్తాన్ని జనరంజకంగా మలచడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు . సత్యన్ సూర్యన్ అందించిన విజువల్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి .  కృష్ణకుమార్ నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఎక్కడా రాజీపడకుండా భారీ తారాగణంతో నిర్మించి తమ నిర్మాణ దక్షత నిరూపించుకున్నారు .

ఓవరాల్ గా :

యాత్ర తప్పకుండా చూడాల్సిన సినిమా

English Title: yatra movie review

                        Click here for English Review