యాత్ర ట్రైలర్ టాక్



Yatra trailer talk

కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ” యాత్ర ” . మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ యాత్ర ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదల చేసారు . మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి నటించిన ఈ చిత్ర ట్రైలర్ మనసులను హత్తుకునేలా ఉంది . అచ్చం రాజశేఖర్ రెడ్డి ని గుర్తు చేసేలా ఉంది . ప్రజల కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసాడు రాజశేఖర్ రెడ్డి . ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రజాధారణ కలిగిన నాయకుడిగా ముద్ర వేసుకున్నాడు .

మమ్ముట్టి డైలాగులు ప్రేక్షకులను అలరించేలా ఉండటంతో యాత్ర కూడా సూపర్ హిట్ అవుతుందనే అంచనాలను పెంచింది . మమ్ముట్టి తో పాటుగా పలువురు ప్రముఖులు నటించిన ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని మహోన్నతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు . వచ్చే నెలలో ఈ యాత్ర సినిమా విడుదల కానుంది .

English Title: Yatra trailer talk