సుకుమార్ ని అవమానించిన కుర్ర డైరెక్టర్


young director insults sukumar

రంగస్థలం చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు సుకుమార్ కాగా అంతటి దర్శకుడిని ఓ యువ దర్శకుడు అవమానించిన తీరు కి పలువురు ప్రముఖులు నిశ్చేస్టులు అవుతున్నారు . ఇంతకీ సుకుమార్ ని తక్కువగా చేసిన కుర్ర డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా ? వీర భోగ వసంతరాయలు అనే సినిమాకు దర్శకత్వం వహించిన ఇంద్రసేన అనే కుర్ర డైరెక్టర్ . నారా రోహిత్ , శ్రీ విష్ణు , సుధీర్ బాబు , శ్రియా శరన్ లు నటించిన వీర భోగ వసంతరాయలు అనే చిత్రానికి ఇంద్రసేన అనే కుర్ర డైరెక్టర్ దర్శకత్వం వహించాడు . అయితే సుకుమార్ ఆ సినిమా ఈవెంట్ కు వచ్చినప్పుడు మహేష్ బాబు తో మీరు చేసిన ” 1 ” నేనొక్కడినే అలా తీసి ఉండాల్సింది కాదు సర్ ……. నేనైతే మరోలా చేసి ఉండేవాడ్ని అని అనడమే కాకుండా మీకు పోటీ ఇచ్చేది నేనే అంటూ అన్నాడట .

ఇది విన్న వాళ్ళు షాక్ అవుతున్నారు . కాన్ఫిడెన్స్ ఉంటే ఫరవాలేదు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది పైగా తనకంటే సీనియర్ అయిన సుకుమార్ తో అలా అవమానకరంగా మాట్లాడటం ముమ్మాటికి తప్పే ! ఇక ఇతగాడు తీసిన సినిమాని ఎక్కువగా ఊహించుకొని ఓవర్ సీస్ లో ముందుగానే విడుదల చేసారు . పరమచెత్త సినిమా అంటూ టాక్ రావడంతో ఇక్కడి బయ్యర్లు భయపడిపోతున్నారు . సినిమా రిలీజ్ విషయమే డౌట్ గా మారింది అంతగా ఎఫెక్ట్ పడింది వీర భోగ వసంత రాయలు సినిమా .

English Title: young director insults sukumar