చిరంజీవి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న యువ దర్శకులు


చిరంజీవి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న యువ దర్శకులు
చిరంజీవి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న యువ దర్శకులు

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా నలుగురు ప్రతిభావంతులైన దర్శకులు అవార్డులు అందుకున్నారు . దాసరి నారాయణరావు పుట్టినరోజైన మే 4 నా డైరెక్టర్స్ డే గా నామకరణం చేసి ఈ వేడుక నిర్వహించారు . కాగా ఈ వేడుకలో పలువురు దర్శకులు పాల్గొనగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అథితిగా ఈ వేడుకకు హాజరయ్యాడు . నీది నాది ఒకే కథ చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల , ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి , చలో దర్శకుడు వెంకీ కుడుముల , కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా లను సత్కరించాడు చిరంజీవి .

దర్శకత్వ శాఖలో ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళ కోసం మూల నిధి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుల సంఘం . ఈ విషయం తెలుసుకున్న ఎస్ ఎస్ రాజమౌళి 50 లక్షల విరాళం ఇవ్వగా చిరంజీవి 25 లక్షల విరాళం ఇచ్చాడు అలాగే రాఘవేంద్రరావు బాహుబలి నిర్మాతల తరుపున 15 లేఖలు తన తరుపున 10 లక్షలు ప్రకటించాడు . దాంతో ఒక కోటి 25 లక్షల మూల నిధి సమకూరింది దర్శకుల సంఘం కు . చిరంజీవి చేతుల మీదుగా ఫంక్షన్ జరగడం అలాగే సత్కారం పొందడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేసారు వేణు ఉడుగుల , అజయ్ భూపతి , వెంకటేష్ మహా , వెంకీ కుడుముల .