రాక్షసుడు గా మారుతున్న యంగ్ హీరో


యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాక్షసుడు గా మారుతున్నాడు . ఈ కుర్ర హీరో రాక్షసుడు గా మారడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? సినిమా కోసం సుమా ! తమిళంలో ఘనవిజయం సాధించిన ” రాక్షసన్ ” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . దాంతో ఆ రీమేక్ చిత్రానికి రాక్షసుడు అనే టైటిల్ ని పెట్టేపనిలో ఉన్నాడు దర్శకుడు రమేష్ వర్మ . 
 
1986 లో రిలీజ్ అయిన రాక్షసుడు చిత్రం మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది . దాంతో సూపర్ హిట్ సినిమా టైటిల్ కాబట్టి తప్పకుండా కలిసి వచ్చే అంశం అని భావిస్తున్నారట ! మధ్యలో సూర్య నటించిన ఓ తమిళ చిత్రానికి కూడా రాక్షసుడు అనే టైటిల్ పెట్టారు కానీ అది అంతగా జనాలకు తెలియదు . రైడ్ , వీరా చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ కు బెల్లంకొండ ఛాన్స్ ఇచ్చాడు . అయితే ఈసారైనా హిట్ కొడతాడా ? చూడాలి . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన చిత్రాలేవీ కమర్షియల్ సక్సెస్ కాలేదు మరి .