ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతిలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరో!!


Naveen Polishetty
Naveen Polishetty

ఇటీవల విడుదలై అన్ ఎక్సపెక్టెడ్ హిట్ అయిన చిత్రం “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” ఈ చిత్రంలో హీరోగా నటించిన నవీన్ పోలిశెట్టి నటనకి ప్రేక్షకుల ప్రశంసలు లభిస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. తక్కువ బడ్జెట్లో రాహుల్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం పెట్టిన దానికి రెండింతలు లాభాలు రాబట్టింది. ముఖ్యంగా హీరో నవీన్ పోలిశెట్టి ఈ ఒక్క హిట్ తో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించాడు.

నవీన్ తో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. అందులో భాగంగా నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన వైజయంతి బ్యానర్లో నవీన్ హీరోగా సినిమా కన్ఫర్మ్ అయింది. ఈ చిత్రంలో నటించే నటీ నటుల వివరాలు త్వరలో తెలపనున్నారు. ఇది కాకుండా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ప్రొడక్షన్ లో కూడా నవీన్ మరో చిత్రం చేయనున్నాడుదాని తెలిసింది!!