`కార్తికేయ 2` కోసం సిక్స్ ప్యాక్!

`కార్తికేయ 2` కోసం సిక్స్ ప్యాక్!
`కార్తికేయ 2` కోసం సిక్స్ ప్యాక్!

యంగ్ హీరోల్లో త‌న‌ది ప్ర‌త్యేక శైలి అని నిరూపించుకున్నారు యంగ్ హీరో నిఖిల్. సినిమాల ఎంపిక‌లోనూ వైవిధ్య‌త‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న ఈ యంగ్ హీరో క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తున్న వేళ నేను సైతం అంటూ ముందుకొచ్చి త‌నకు తోచిన స‌హాయం అందించి అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకున్నాడు. సానిటైజ‌ర్‌లు, మాస్కులు అందించి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు.

ప్ర‌స్తుతం నిఖిల్ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2లో బ‌న్నీ వాసు నిర్మిస్తున్న `18 పేజెస్‌` చిత్రంతో పాటు `కార్తికేయ‌` చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న సీక్వెల్ `కార్తికేయ‌2`లో న‌టిస్తున్నాడు. క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్ కార‌ణంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో సినిమాల షూటింగ్‌ల‌న్నీ ఆగిపోయాయి. అందులో నిఖిల్ న‌టిస్తున్న సినిమాలు కూడా వున్నాయి. మిస్టీరియ‌స్ టెంపుల్స్ వెన‌కున్న ర‌హ‌స్యాల్ని ఛేధించే ఓ యువ‌కుడి క‌థ‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానంలో శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి స‌న్నిధిలో ప్రారంభ‌మైంది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌ప్ర‌భావం వుండ‌టంతో అంతా ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. `కార్తికేయ 2` టీమ్ కూడా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అంటోంది. ఇంటి ప‌ట్టునే వుంటున్న హీరో నిఖిల్ క్యారెక్ట‌ర్ కోసం వ‌ర్క‌వుట్స్ చేస్తున్నాడు. సినిమా లో నిఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో క‌నిపించ‌బోతున్నాడు.య‌దీనికి సంబంధించిన ఓ సెల్ఫీ ఫొటోని నిఖిల్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. మ‌రో నాలుగు వారాల్లో ఫుల్ సిక్స్ ప్యాక్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నాను` అని పేర్కొన్నాడు నిఖిల్‌.

Credit: Twitter