మహేష్ బాబు పై సెటైర్ వేసిన యంగ్ హీరో


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పై సెటైర్ వేసాడు యంగ్ హీరో విశ్వక్ సేన్ . మహర్షి చిత్ర విజయోత్సవ వేడుకలో మహేష్ బాబు కాలర్ ఎగరేసి సంచలనం సృష్టించాడు అయితే నిజానికి ఆ కాలర్ ఎగరేయాల్సింది నేను అని కానీ మరొకరు ఎగరేశారు కాబట్టి నేను కాలర్ ఎగరేయడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు విశ్వక్ సేన్ . ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ” ఫలక్ నుమా దాస్ ” . రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది ఈ చిత్రం .

అయితే సినిమా నేను ముందుగానే చూసుకున్నాను అలాగే మరికొంతమంది కూడా చూసారు తప్పకుండా సూపర్ హిట్ కొట్టబోతున్నాం అంటూ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసాడు . అంతేకాదు హిట్ అయ్యాక కాలర్ ఎగరేద్దామనుకున్నా కానీ ఈలోపే మరొకరు ఎగరేశారు కాబట్టి నేను ఆ పని చేయను అంటూ పరోక్షంగా మహేష్ బాబు ని ఉదహరించారు విశ్వక్ సేన్ . ఇక ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతోందో రేపు తెలిసిపోనుంది .