కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ హీరో


young hero sushanth emotional on his dad కింగ్ నాగార్జున మేనల్లుడు అయిన సుశాంత్ తన తండ్రి ని గుర్తుచేసుకుంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు . సుశాంత్ హీరోగా పరిచయమై అప్పుడే పదేళ్లు అయ్యాయి కానీ ఇంతవరకు ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు . కాళిదాసు చిత్రంతో హీరోగా పరిచయమైన సుశాంత్ కు ఈ పదేళ్ల కాలంలో హిట్ దక్కలేదు అలాగే ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు . కాళిదాసు , కరెంట్ , అడ్డా , దొంగాట లో గెస్ట్ అప్పియరెన్స్ , ఆటాడుకుందాం రా చిత్రాలు చేయగా అన్ని కూడా ప్లాప్ అయ్యాయి ఇక ఇప్పుడేమో ” చి ల సౌ ” చిత్రం చేస్తున్నాడు . ఈ చిత్రాన్ని ఆగస్టు 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణ్ రావు కి అప్పుడెప్పుడో మాట ఇచ్చాడట తప్పకుండా హిట్ కొడతా నాన్న అని ! అయితే సుశాంత్ హిట్ చూడకుండానే చనిపోయాడు దాంతో ఈ చి ల సౌ కథ నాన్నకు చెప్పానని తప్పకుండా హిట్ అవుతుందని చెప్పాడని తండ్రి ని గుర్తు చేసుకుంటూ కుమిలిపోయాడు సుశాంత్ . మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు ఈ హీరో , కనీసం ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడా ? అన్న ఆత్రుత నెలకొంది అందరిలో ముఖ్యంగా అక్కినేని కుటుంబంలో . మహానటుడు అక్కినేని మనవడిగా ఎంట్రీ ఇచ్చాడు కానీ సక్సెస్ కొట్టలేకపోయాడు దాంతో ఆ లోటు ఈ చి ల సౌ తీర్చుతుందని ఆశిస్తున్నాడు . సుశాంత్ కోరిక నెరవేరుతుందా ? లేదా ? తెలియాలంటే ఆగస్టు 3 వరకు ఎదురు చూడాల్సిందే .

English Title: young hero sushanth emotional on his dad