తండ్రి కాబోతున్న యంగ్ హీరో


Young hero yash Happy movementయంగ్ హీరో యశ్ తండ్రి కాబోతున్నాడు . కన్నడంలో యువకేరటం లా దూసుకుపోతున్న హీరో యశ్ కాగా అతడు తండ్రి కాబోతుండటం తో పట్టరాని సంతోషం తో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేసాడు. యశ్ రాధికా పండిట్ ని పెళ్లి చేసుకున్నాడు కాగా ఆమె త్వరలోనే పండంటి బిడ్డకు జన్మ నివ్వ బోతోందని తెలిసి భార్యాభర్తలు సంతోషం లో తేలియాడుతున్నారు. యశ్ తండ్రి కాబోతుండటం తో అతడి అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

కన్నడంలో యువ హీరోగా రాణిస్తున్న యశ్ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తండ్రి హోదా తీయని అనుభూతిని , అంతకుమించి మధురానుభూతిని ఇవ్వడంతో యశ్ ఆనందానికి అంతేలేకుండా పోయింది. ప్రస్తుతం తన భార్య గర్భం దాల్చడంతో ఆమె పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు యశ్. అన్ని విషయాలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు ఈ హీరో. ఎంతైనా వారసులు రాబోతున్నారంటే ఆ ఆనందమే వేరు కదా !

English Title: Young hero yash Happy movement