జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త అడుగులు

జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త అడుగులు
జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త అడుగులు

జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి భగవంతుడు ఇచ్చిన ఒక బహుమతి అని చెప్పవచ్చు. డాన్స్ పరంగా, నటన పరంగా, హావభావాల పరంగా అన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ పండించగల నటుడు జూనియర్ ఎన్టీఆర్. సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ ఎప్పటికప్పుడు, ఇంకా బలమైన విభిన్నమైన పాత్రలు చేసే దిశగా ఆలోచించే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తాజాగా మరో ఒక నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ ఒక బ్యానర్ ను స్థాపించి చిత్రాలు నిర్మించనున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కి నటన మాత్రమే కాదు సినిమా మేకింగ్ కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన నటీనటులు, టెక్నీషియన్లు కూడా ఇదే విషయం పలు ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటారు. ఎంతో చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చి పలు ఆటుపోట్లను ఎదుర్కొని చివరకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకానొక మెయిన్ పిల్లర్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ కి సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ మీద పట్టు ఉంది.

వచ్చే ఏడాదిలో జూనియర్ ఎన్టీఆర్ తన సొంత బ్యానర్ మీద సినిమాలు చేయబోతున్నాడు. టాలీవుడ్ లో ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రానా, నాని పలువురు హీరోలకు సొంత ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి. ఇక వాళ్ల జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరబోతున్నాడు. తన సొంత బ్యానర్ లో కేవలం తాను నటించే చిత్రాల నిర్మాతగా వ్యవహరిస్తాడా.? లేక ఇతర నటీనటులకు, కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ సినిమాలు నిర్మిస్తాడా, అన్న విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం R.R.R చిత్రీకరణ లో బిజీగా ఉన్నాడు.

మరి నటనతో పాటు ఎంతో ప్రతిభ కలిగిన జూనియర్ ఎన్టీఆర్ నిర్మాతగా కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం.