యంగ్‌ టైగ‌ర్ ఫ్యామిలీ హోలీ ట్రీట్‌!


యంగ్‌ టైగ‌ర్ ఫ్యామిలీ హోలీ ట్రీట్‌!
యంగ్‌ టైగ‌ర్ ఫ్యామిలీ హోలీ ట్రీట్‌!

టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ మ‌ధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్న విష‌యం తెలిసిందే. ఎంత బిజీగా వున్నా ఫ్యామిలీకి మాత్రం ఖ‌చ్చితంగా టైమ్‌ను కేటాయిస్తున్నారు. మ‌హేష్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` రిలీజ్ త‌రువాత ఫ్యామిలీతో క‌లిసి అమెరికా వెకేష‌న్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే. టైమ్ దొరికిన‌ప్పుడ‌ల్లా త‌మ ఫ్యామిలీస్‌తో ఇలాగే స్టార్ హీరోలు ఎంజాయ్ చేస్తూ సంబ‌రాల్లో మునిగితేలుతుంటారు.

తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఫ్యామిలీతో క‌లిసి మంగ‌ళ‌వారం హంగామా చేశారు. గ‌త కొంత కాలంగా వ‌రుస సినిమాల షూటింగ్‌ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపిన తార‌క్ ఫ్యామిలీ విష‌యం వ‌చ్చేస‌రికి మాత్రం సెప‌రేట్‌గా కొంత టైమ్‌ని కేటాయిస్తుంటారు. పిల్ల‌ల‌తో కాల‌క్షేపం చేస్తుంటారు. అంద‌రి స్టార్స్‌లాగు ఎన్టీఆర్ కూడా మంగ‌ళ‌వారం త‌మ పిల్ల‌లు, భార్య‌తో క‌లిసి హోలీ హంగామా చేశారు.

దీనికి సంబంధించిన ఓ ఫొటోని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. తార‌క్ కుటుంబం రంగుల్లో మ‌నిగిపోయిన ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ `ఆర్ఆర్ఆర్‌`లో కొమ‌రంభీంగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ య‌మ స్పీడుగా సాగుతోంది. త్వ‌ర‌లోనే త్రివిక్ర‌మ్ చిత్రాన్ని కూడా మొద‌లుపెట్ట‌బోతున్నాడు.

Credit: Twitter