ఫొటోగ్రాఫ‌ర్‌పై పంచులేసిన స్టార్ హీరో!


Young tiger NTR funny conversation with photographer
Young tiger NTR funny conversation with photographer

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సీరియ‌స్ స‌న్నివేశాల్లో డైలాగ్స్‌ని ఎంత ఫోర్స్‌గా చెబుతారో అంద‌రికి తెలిసిందే. అంతే ఫ‌న్నీగా పంఛ్ లు కూడా వేస్తార‌ని తాజాగా బ‌య‌ట‌ప‌డింది. తెర‌పై వీరోచిత స‌న్నివేశాల్లో భారీ డైలాగ్‌ల‌తో ఆక‌ట్టుకునే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌దాగా సెట్‌లో ఆట‌ప‌ట్టిస్తుంటార‌ని ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసిన చిత్ర యూనిట్ స‌భ్యులు చెబుతుంటారు. అయితే అలాంటి స‌ర‌దా సంఘ‌ట‌న తాజాగా ఒక‌టి బ‌య‌ట‌ప‌డ్డింది. ఓ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్‌పై ఎన్టీఆర్ స‌ర‌దాగా వేసిన పంచ్‌ల‌కు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

`ఆర్ ఆర్ ఆర్‌` షూటింగ్‌లో చిన్న విరామం ల‌భించ‌డంతో ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న షూటింగ్ కోసం ముంబై వెళ్లారు ఎన్టీఆర్‌. చిత్రీక‌ర‌ణ పూర్త‌వ్వ‌డంతో తిరిగి హైద‌రాబాద్ చేరుకున్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ శంషాబాద్ ఏయిర్‌పోర్ట్‌లో దిగారు. బ‌య‌టికి వ‌స్తున్న ఎన్టీఆర్‌ని ఫొటోలు తీసేందుకు ఓ ఫొటోగ్రాఫ‌ర్ ప్ర‌య‌త్నించాడు. ఇది గ‌మ‌నించిన ఎన్టీఆర్ అత‌నిపై స‌ర‌దాగా పంచ్‌లు వేయ‌డం వైర‌ల్‌గా మారింది. `నువ్వు ఇక్క‌డే వుంటావా? తిండి స్నానం అంతా ఇక్క‌డేనా?` అని ఎన్టీఆర్ ఫొటోగ్రాఫ‌ర్‌ని స‌ర‌దాగా ఆట‌పట్టించార‌ట‌.

దీంతో ఎన్టీఆర్ చుట్టూ వున్న వాళ్లంతా న‌వ్వేశార‌ట‌. ఫొటోగ్రాఫ‌ర్ మాత్రం త‌న‌ని గుర్తు పెట్టుకుని మ‌రీ ఎన్టీఆర్ పల‌క‌రించ‌డంతో ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ‌య్యాడట‌. దీనికి సంబంధించిన వీడియోని ఎవ‌రో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో సామ‌జిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారిపోయింది.