టాలీవుడ్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న యుట్యూబ్ చానల్స్


Youtube channels crossing their limits 

టాలీవుడ్ పేరుతో యుట్యూబు ఛానల్ ని రన్ చేసే అధికారం కేవలం టాలీవుడ్ మ్యాగజైన్ కు మాత్రమే ఉంది కాని బాలీవుడ్ ఇండస్ట్రీ తర్వాత అంత పెద్దది మళ్లీ కేవలం టాలీవుడ్ మాత్రమే కావడంతో …… సినిమా న్యూస్ కు గాసిప్స్ కు ఎక్కువ లైక్స్ , వ్యూస్ వస్తుండటంతో టాలీవుడ్ కు ముందు కానీ వెనుక కానీ ఏదో ఒక తోక తగిలించి పలు యుట్యూబ్ ఛానళ్లు మోసాలకు , అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఇష్టం వచ్చిన రీతిలో పలువురు టాలీవుడ్ హీరో హీరోయిన్ లపై చండాలమైన రాతలను రాస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. ఇష్టమొచ్చిన రీతిలో హెడ్డింగ్ లు పెడుతూ వ్యూస్ కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి.

ప్రభాస్ కు అనుష్క కు పెళ్లి అయ్యిందంటూ ఓ వెడ్డింగ్ పిలుపు ఇలా ఉందంటూ ఉప్పలపాటి వారి పెండ్లి పిలుపు తో వండి వార్చారు . అలాగే ఈమద్యే మిర్యాలగూడలో తక్కువ కులం వాడు అంటూ ప్రణయ్ ని అత్యంత కిరాతకంగా చంపించిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయాన్ని చెప్పడంలో తప్పులేదు కానీ ప్రణయ్ తమ్ముడిని నేను పెళ్లి చేసుకుంటాను అని అమృత చెప్పినట్లుగా కథనం అల్లి యుట్యూబ్ లో పెట్టేసారు. ఎంత దారుణం , ప్రణయ్ తమ్ముడు అమృతకు మరిది అవుతాడు పైగా నాకు అన్నా తమ్ముళ్లు లేరు కాబట్టి అని అతడికి రాఖీ కూడా కట్టింది అమృత . అయితే ఈ విషయలేవీ పట్టించుకోకుండా కేవలం యుట్యూబ్ హిట్స్ కోసం టాలీవుడ్ పేరుతో అడ్డగోలు రాతలు రాస్తూ వికృతానందం పొందుతున్నారు . యుట్యూబ్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు.

English Title: Youtube channels crossing their limits

Youtube channels crossing their limits