జగన్ సంచలనం : ఒకేసారి 175 స్థానాల ప్రకటన


YS Jagan releases contestants list 

వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సంచలనం సృష్టించాడు ఒకేసారి 175 స్థానాల అభ్యర్థులను ప్రకటించాడు . ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11 న పోలింగ్ కాగా రేపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది దాంతో  నామినేషన్ల  పర్వం మొదలు కానుంది . ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 కాగా ఒకేసారి 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అందరికి షాక్ ఇవ్వడమే కాకుండా అభ్యర్థులను ప్రచారం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసాడు జగన్ .

 

ఈరోజు పులివెందుల లోని ఇడుపులపాయలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసాక ఈ లిస్ట్ రిలీజ్ చేసాడు జగన్ . 175 అసెంబ్లీ స్థానాలతో పాటుగా 25 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించాడు . దాంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది . అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో ప్రచార పర్వం ఊపందుకోనుంది .

English Title : YS Jagan releases contestants list