ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను …..


ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అంటూ ప్రమాణస్వీకారం చేయనున్నాడు జగన్ . ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీకి అవుతున్న రెండో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలనీ 2009 లోనే అనుకున్నాడు జగన్ కానీ కాంగ్రెస్ పార్టీ జగన్ ఆశలపై నీళ్లు చల్లింది దాంతో సైలెంట్ అయ్యాడు , అయితే తండ్రి మరణంతో పెద్ద ఎత్తున చనిపోయిన కుటుంబాలను కలిసి ఓదార్చాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యక్తిరేకించడంతో పాటుగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా చేయడంతో జగన్ కాంగ్రెస్ పార్టీకి , పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు .

అప్పటి నుండి పోరాటం చేస్తూనే ఉన్నాడు . 2014 లో అధికారం దక్కుతుందని అనుకుంటే కొద్దిలో అదృష్టం చేజారింది దాంతో పట్టువదలని విక్రమార్కుడిలా తండ్రికి అధికారం ని అందించిన పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకం అయ్యాడు , తిరుగులేని భారీ మెజారిటీ తో ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టబోతున్నాడు . ఈరోజు విజయవాడలో ప్రజల సమక్షంలో జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు . ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు .