ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన జగన్


ysrcp chief jagan mohan reddy called for bundh on 24th

ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈనెల 24న ఏపీ బంద్ కు పిలుపునిచ్చాడు ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి. నిన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాడు జగన్. బయటకు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు వ్యవహరిస్తూ లోపాయకారి ఒప్పందాలతో బాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు జగన్ . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో ఎటువంటి చర్చ చేయకుండా అహంకార పూరితంగా వ్యవహరించిన తీరు కి నిరసనగా ఈనెల 24 న ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునిస్తున్నామని స్పష్టం చేశాడు జగన్.

మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబడుతోంది జగనే . పలుమార్లు స్పెషల్ స్టేటస్ కోసం గొంతెత్తాడు అయితే బాబు ని రాజకీయంగా ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తుండటంతో జగన్ చేస్తున్న పోరాటం పక్కదారి పట్టింది. ఇక లోక్ సభలో కూడా ప్రత్యేక హోదా అంటూ నినదించిన జగన్ పార్టీ ఎంపీలు రాజీనామా చేయడం , నాటకీయ పరిణామాల మధ్య ఆమోదం పొందడంతో నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానం లో పాల్గొనే ఛాన్స్ లేకుండా పోయింది. అవిశ్వాస వీగిపోవడంతో ఒక్కసారిగా చంద్రబాబు పై విరుచుకు పడుతున్నారు ప్రతిపక్ష పార్టీలు. జగన్ , పవన్ లతో పాటుగా భారతీయ జనతా పార్టీ నేతలు.

English Title: ysrcp chief jagan mohan reddy called for bundh on 24th