కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో సాగే లవ్, క్రైమ్ థ్రిల్లర్ ‘యూరేక’

కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో సాగే లవ్, క్రైమ్ థ్రిల్లర్ 'యూరేక'
కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో సాగే లవ్, క్రైమ్ థ్రిల్లర్ ‘యూరేక’

కార్తిక్ ఆనంద్ హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం ‘యూరేక’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులలో డీసెంట్ అంచనాలను నెలకొల్పడంలో సక్సెస్ అయింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన అయిగిరి నందిని వెర్షన్ మంచి పేరు తెచ్చుకుంది. సినిమాలో కీలకమైన సమయంలో ఈ పాట వస్తుందని సమాచారం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చ్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో మరియు దర్శకుడు కార్తీక్ ఆనంద్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.

కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో సాగే లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మా యూరేక. కాలేజ్ లో జరిగే ఫెస్ట్ పేరు యూరేక. అందుకే ఆ టైటిల్ ను నిర్ణయించాం. ఇక కాలేజ్ ఫెస్ట్ నేపధ్యంగా సినిమా కావడంతో యూత్ ఎక్కువగా మా సినిమాకు కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాం. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ముగ్గురికీ మంచి పేరు తీసుకొస్తుంది ఈ చిత్రం. ముగ్గురి పాత్రలకూ ప్రాధాన్యం ఉంది. నేను రాసుకున్న దానికంటే తెరపై ఇంకా బాగా వచ్చిందని నమ్ముతున్నాడు. ఇప్పటివరకూ సినిమా చూసిన వాళ్ళు అందరూ బాగుందని ప్రశంసించారు. అదే చిత్ర రిజల్ట్ పై నమ్మకం పెంచింది. సెకండ్ హాఫ్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచే అవకాశముంది అని తెలిపాడు దర్శకుడు మరియు హీరో కార్తీక్ ఆనంద్.

ఈ చిత్రంలో కార్తీక్ ఆనంద్ సరసన హీరోయిన్లుగా డింపుల్ హయతి, సయ్యద్ సోహైల్ రియాన్, షాలిని సమీక్ష నటించారు. ఇంకా ఇతర ముఖ్య పాత్రల్లో బ్రహ్మాజీ, రఘు బాబు, అలీ, మహేష్ విట్టా తదితరులు కనిపిస్తారు. నరేష్ కుమరన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ప్రశాంత్ తాత ఈ చిత్రాన్ని నిర్మించాడు. మరి మార్చ్ 13న విడుదల కాబోతోన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.