కొర‌టాల శివ – అల్లు అర్జున్ మూవీ వుందా?

Yuvasudha arts clarifies allu arjun koratala movie
Yuvasudha arts clarifies allu arjun koratala movie

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మెగాప‌వ‌ర్‌స్టార్‌తో క‌లిసి న‌టిస్తున్నభారీ మ‌ల్టీస్టారర్ మూవీ `ఆర్ఆర్ఆర్‌`. జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాతకంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ త‌రువాత ఎన్టీఆర్ త‌న 30వ చిత్రా‌న్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో చేయాల్సింది. అయితే ఆ ప్రాజెక్ట్ స్థానంలో ఎన్టీఆర్ డైరెక్ట‌ర్ కొర‌టాల‌తో త‌న 30వ చిత్రాన్ని చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.

అంతే కాకుండా ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో క‌లిసి యువ సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ మిక్కిలినేని నిర్మిస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. దీంతో ఇదే సంస్థ ఏడాది క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన ప్రాజెక్ట్ ఇక లేన‌ట్టే అంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఈ ప్ర‌చారానికి ఫుల్ స్టాప్ పెడుతూ యువ సుధ ఆర్ట్స్ సంస్థ అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేద‌ని స్ప‌ష్టం చేసింది. గ‌తంలో `ఏఏ21` అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో యువ సుధ ఆర్ట్స్ సంస్థ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేద‌ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కొర‌టాల శివ చేయ‌నున్న మూవీ నిర్మాణ ద‌శ‌లోనే వుంద‌ని, ఆగిపోలేద‌ని, 2022 ఏప్రిల్ త‌రువాత ఈ మూవీ సెట్స్‌పైకి వెళుతుంద‌ని, ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని గీతా ఆర్ట్స్2 సంస్థ‌తో క‌లిసి చ‌ర్చించి వెల్ల‌డిస్తామ‌ని యువ సుధ ఆర్ట్స్ సంస్థ అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా స్ప‌ష్టం చేసింది.