కారుతో గుద్దేసి చంపిన హీరోయిన్


Zareen khan car met accident
Zareen khan

బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ ప్రయాణిస్తున్న కారు అత్యంత వేగంగా వచ్చి ఓ బైక్ ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు దాంతో జరీన్ ఖాన్ పై కేసు నమోదు చేసారు పోలీసులు అంతేకాదు జరీన్ ఖాన్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు . ఇక ఈ సంచలన సంఘటన గోవాలో జరిగింది . ముంబై నుండి గోవా వెళ్లాలనుకున్న జరీన్ ఖాన్ అక్కడి నుండి కారులోనే బయలుదేరింది .

అయితే కారు వేగంగే వెళ్తూ ఓ బైక్ ని ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు . అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించడంతో జరీన్ ఖాన్ డ్రైవర్ ని అరెస్ట్ చేసారు పోలీసులు . ఈ యాక్సిడెంట్ లో హీరోయిన్ జరీన్ ఖాన్ కు స్వల్ప గాయాలు అయ్యాయి . జరీన్ ఖాన్ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే . హీరోయిన్ గా స్టార్ డం అందుకోలేదు కానీ హాట్ ఇమేజ్ ని మాత్రం సంపాదించింది . కానీ ఇలా గోవాలో యాక్సిడెంట్ లో ఇరుక్కుంది పాపం .

English Title: Zareen khan car met accident