ఈ బాలీవుడ్ హీరోయిన్ ని ముద్దుల ప్రాక్టీస్ కు రమన్నారట

Zareen Khan
ఈ బాలీవుడ్ హీరోయిన్ ని ముద్దుల ప్రాక్టీస్ కు రమన్నారట

బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ గుర్తుందా? అదేనండీ కత్రినా కైఫ్ డూప్ అంటూ ట్రోల్స్ చేసేవారు.. ఇప్పుడు గుర్తొచ్చిందా? సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీకి వీర్ సినిమా ద్వారా పరిచయం చేసిన ఈ బ్యూటీ హేట్ స్టోరీ 3 చిత్రంతో పాపులర్ అయింది. అయినా తగిన ఆఫర్లు రాక ఈమె కెరీర్ దాదాపు ముగిసిపోయే పరిస్థితుల్లో ఉంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు కొన్ని సంచలన విషయాలు చెప్పి అందరినీ షాక్ కు గురి చేసింది.

ఈ మధ్య కాలంలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎంతగా హైలైట్ అవుతోందో అందరికీ తెల్సిందే. ఈ నేపథ్యంలో తను కూడా కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డానని చెప్పింది. ఒక ప్రముఖ దర్శకుడు సినిమాలో ఒక సీన్ కోసం ముద్దుల ప్రాక్టీస్ చేయడానికి తనను పిలిచాడని, అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్తైనా తాను ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా కొంతమందితో స్నేహానికి మించి చనువుగా ఉంటే అదనపు గుర్తింపు ఉంటుందని బాలీవుడ్ కు చెందిన ఒక వ్యక్తి తనతో అన్నాడని వ్యాఖ్యానించింది.

ఇలాంటి సంఘటనలు అయితే చెప్పింది కానీ ముద్దుల ప్రాక్టీస్ కు పిలిచినదెవరో, స్నేహానికి మించి చనువుగా ఉండమన్నది ఎవరో అన్నది మాత్రం చెప్పలేదు జరీన్.